నిర్మల్ జిల్లా ముజ్గి గ్రామంలో జరిగిన మల్లన్న రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ వేడుకల్లో నెలకొన్న తొక్కిసలాటలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఊరేగింపు సమయంలో ఏర్పడిన తొక్కిసలాటలో ఓ మహిళా కానిస్టేబుల్‌తో పాటు నిర్మల్ రూరల్ మండలం అక్కపూర్ గ్రామానికి చెందిన మల్లేష్ తీవ్ర గాయాలపాలయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండంతో చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మల్లేష్ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతిచెందారు.
మహిళా కానిస్టేబుల్ నందిని తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మల్లేష్ మృతదేహానికి నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు. దైవ దర్శనానికి వెళ్లి మల్లేష్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు.
ఇదీ చదవండి: భక్తుల సందడి మధ్య వైభవంగా ముజ్గి మల్లన్న రథోత్సవం