ETV Bharat / crime

పెళ్లింట విషాదం... బైక్​పై నుంచి పడి పెళ్లి కూతురి తండ్రి మృతి

కొన్ని రోజుల్లో కూతురి పెళ్లి.. కావలసినవన్నీ సిద్దం చేసుకున్నారు. కాని బాజా భజంత్రీలతో కూతురిని అత్తారింటికి పంపాలన్న ఆ తండ్రి ఆశ మాత్రం నేరవేరలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అతన్ని కబళించింది. పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం చోటుచేసుకోవడం అందరినీ కలిచివేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటన ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కోమటినేనివారి పాలెం గ్రామాంలో చోటుచేసుకుంది.

youngman died in bike accident at guntur
పెళ్లింట విషాదం... బైక్​పై నుంచి పడి వ్యక్తి మృతి
author img

By

Published : Jul 26, 2021, 2:03 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెం గ్రామానికి చెందిన చిట్టి బోయిన వెంకటేశ్వర్లు (40) రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రిలో చేర్చగా.. పరిస్థితి విషమించి ఆదివారం సాయంత్రం మృతి చెందాడు.

సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామానికి చెందిన చిట్టి బోయిన వెంకటేశ్వర్లు కు చిలకలూరిపేట మండలం కోమటినేనివారి పాలెం గ్రామానికి చెందిన రమాదేవితో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వెంకటేశ్వర్లు అత్తగారి ఊరిలోనే ఉంటూ పొలం కౌలుకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. వారికి అమ్మాయి, అబ్బాయి ఉన్నారు.

ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటున్న కుమార్తెకు.. అదే గ్రామానికి చెందిన యువకుడితో వెంకటేశ్వర్లు దంపతులు వివాహం నిశ్చయం చేశారు. ఆగస్టులో వివాహం చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి కోసం అన్ని సిద్దం చేసుకుంటున్న తరుణంలో 23వ తేదిన వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై పొలానికి వెళుతుండగా అదుపు తప్పి కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లకు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు.

ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులను ఓదార్చడం కష్టతరంగా మారింది. అందరితో కలుపుగోలుగా ఉండే వెంకటేశ్వర్లు ఇక లేడన్న విషయాన్ని గ్రామస్తులు, అతని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఇలాంటి విషాద సంఘటన జరగడం అందరినీ కలచివేస్తోంది.

ఇదీ చదవండి: father harassment: కన్న బిడ్డలతో అసభ్య ప్రవర్తన..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.