ETV Bharat / crime

కదులుతున్న రైలులో నుంచి పడి వ్యక్తి మృతి

వేగంగా వెళ్తున్న రైలులో నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్​ రైల్వే జీఆర్​పీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

person died in secunderabad railway station
సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో వ్యక్తి మృతి
author img

By

Published : Mar 28, 2021, 3:01 PM IST

వేగంగా ప్రయాణిస్తున్న రైలులో నుంచి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కింద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. చర్లపల్లి, ఘట్​కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల మీద ఓ గుర్తు తెలియని వ్యక్తి(45) మృతదేహం పడి ఉన్నట్లుగా రైల్వే సిబ్బంది గుర్తించారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే జీఆర్​పీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మృతుడి వద్ద చిరునామాకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతదేహం పడి ఉన్న తీరును బట్టి ఆ వ్యక్తి రైలు డోరు వద్ద నిల్చుని ఉండగా ప్రమాదవశాత్తు కిందపడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: రొయ్యల పరిశ్రమపై గ్రామస్థుల ఆగ్రహం.. రూ.50 లక్షల నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.