ETV Bharat / crime

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య - భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

భార్యాభర్తలిద్దరూ ఏడాది క్రితం గొడవపడి విడిగా ఉంటున్నారు. కాపురానికి రావాల్సిందిగా తన భార్యను అతడు చాలా సార్లు పిలిచినా.. అందుకు ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని ఇంద్రేశం గ్రామంలో జరిగింది.

a man commit suicide in sangareddy district
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
author img

By

Published : Jun 21, 2021, 12:30 PM IST

భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో జరిగింది.

జిల్లాలోని ఇంద్రేశం గ్రామానికి చెందిన షేక్ సలీమ్‌ (35)కు ఏడాది క్రితం భార్యతో గొడవైంది. ఈ కారణంగా వారిద్దరూ విడిగా ఉంటున్నారు. సలీమ్‌ తన స్వగ్రామంలోనే ఉండగా.. అతని భార్య రామచంద్రాపురం గ్రామంలో పిల్లలతో కలిసి తన తల్లిదండ్రులతో ఉంటోంది.

కాపురానికి రావాల్సిందిగా అతడు తన భార్యను చాలాసార్లు కోరినా.. అందుకు ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన సలీమ్‌ తన గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Wife Killed Husband: కూల్​డ్రింక్​లో ఎలుకల మందు కలిపి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.