WIFE KILLED BY HUSBAND: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణాలు చేసిన భర్తే భార్యను కడతేర్చాడు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గోదావరిఖని సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన సుందరగిరి రాజేష్ సెల్ ఫోన్ షాపు నిర్వహించేవాడు. భార్య రక్షిత మధ్య బంగారు నగల తాకట్టు విషయంలో గత కొద్ది రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి.
తనకు తెలియకుండా బంగారు నగలు అమ్మడంతో రక్షిత ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సహనం కోల్పోయిన రాజేష్ సోమవారం ఇంట్లో ఉన్న పదునైన ఆయుధంతో భార్యపై దాడి చేసి హతమార్చాడు. అనంతరం రామగుండం ఎన్టీపీసీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: CYBER FRAUD: రెండోసారి ఓటీపీయా.. ఓసారి ఆగండి.. ఆగండి..
మైనర్‌పై రెండేళ్లుగా అత్యాచారం.. తీవ్రంగా హింసించి గ్యాంగ్‌రేప్