హైదరాబాద్ కొత్తపేట హుడా ఎంప్లాయిస్ కాలనీలోని తడక వెంకటేశ్వర్లు అనే వ్యాపారి ఇంట్లో... గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 30 తులాల బంగారు ఆభరణాలను దొంగలించారు. తన నివాసంలో దొంగతనం జరిగిందని తెలుసుకున్న బాధితుడు సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ బృందంతో దర్యాప్తు చేపట్టారు. పూర్తిస్థాయిలో విచారణ అనంతరం వివరాలు అందజేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: 'వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే పీవీకి సరైన గౌరవం'