ETV Bharat / crime

Fire Accident In Cloth Store: వస్త్రదుకాణంలో అగ్నిప్రమాదం.. రూ.50 లక్షల ఆస్తి నష్టం - కొల్లాపూర్‌లో అగ్నిప్రమాదం

fire accident
వస్త్రదుకాణంలో అగ్నిప్రమాదం
author img

By

Published : May 1, 2022, 9:43 PM IST

Updated : May 2, 2022, 6:49 AM IST

21:40 May 01

నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లోని వస్త్రదుకాణంలో అగ్నిప్రమాదం

Fire Accident In Cloth Store: నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శివ క్లాత్​స్టోర్​లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బట్టల షాపు కావడం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. చుట్టూ పక్కల ఉన్న దుకాణ యజమానులు భయంతో పరుగులు తీశారు. మంటలు భారీగా చెలరేగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మంటలు షాపు నుంచి బయటకు ఎగిసిపడ్డాయి. దుకాణం తాళం వేసి ఉండడం వల్ల మంటలు ఆర్పే సాహసం ఎవరూ చేయలేకపోయారు.

వెంటనే తాళం పగలగొట్టి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది.. మంటలు అదుపు చేశారు. అప్పటికే దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో.. దాదాపు 60 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని షాపు యజమాని గుడిపాటి సూర్య నారాయణ తెలిపారు.

ఇవీ చూడండి: Mallareddy On Mayday: అట్లుంటది.. మంత్రి మల్లారెడ్డితోని!

షవర్మా తిని విద్యార్థిని మృతి.. ఆస్పత్రిలో మరో 18 మంది

Last Updated : May 2, 2022, 6:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.