జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కర్నూలు నుంచి కాజీపేట్ వెళ్తున్న రైలులోని 11, 12 బోగీలు విడిపోయాయి. అనంతరం రైలు సుమారు 300 మీటర్ల దూరం వెళ్లి ఆగిపోయింది. రెండు బోగీలు పూర్తిగా విడిపోవడంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు.
![A goods train derailed at station Ghanpu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15752171_train-1.jpeg)
ఇవీ చదవండి:
![A goods train derailed at station Ghanpur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15752171_train-4.jpeg)