ETV Bharat / crime

investment Fraud gang Arrested: పెట్టుబడుల పేరుతో చైనీయుల మోసాలు.. వారంలోనే రూ.2.42 కోట్లు! - తెలంగాణ వార్తలు

investment Fraud gang Arrested, fraud gang in hyderabad
పెట్టుబడుల పేరుతో మోసాలు చేస్తున్న ముఠా అరెస్టు..
author img

By

Published : Dec 24, 2021, 1:18 PM IST

Updated : Dec 24, 2021, 3:15 PM IST

13:15 December 24

పెట్టుబడుల పేరుతో మోసాలు చేస్తున్న ముఠా అరెస్టు

investment Fraud gang Arrested : చైనీయులు మరో మోసానికి పాల్పడ్డారు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలిస్తామంటూ అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఈ మోసం బయటపడింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనివెనుక చైనాకు చెందిన జూలీ, మైకెల్ హస్తం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

లాక్​డౌన్ కంటే ముందే..

లాక్​డౌన్ కంటే ముందు హైదరాబాద్ వచ్చిన జూలీ, మైకెల్... మాదాపూర్​లో ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. విజయకృష్ణ, శ్రీనివాస్ రావు, విజయభాస్కర్ రెడ్డితో పాటు మరో 8మంది సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద 12కంపెనీలను సృష్టించారు. 12కంపెనీల పేరుతో 15 బ్యాంకు ఖాతాలను తెరిచారు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలిస్తామంటూ పలువురు అమాయకులను నమ్మించి కోట్లలో వసూలు చేశారు.

ఎంత కొల్లగొట్టారు?

సీసీఎస్ పోలీసులు 2 బ్యాంకు ఖాతాలను పరిశీలించగా... వారం రోజుల వ్యవధిలో 2.42కోట్లు జమ అయినట్లు గుర్తించారు. ఆ నగదు మొత్తం కూడా వెంటనే విత్ డ్రా అయినట్లు సీసీఎస్ దర్యాప్తులో తేలింది. వసూలు చేసిన నగదును బ్యాంకు ఖాతాల నుంచి జూలీ, మైకెల్ విత్ డ్రా చేసుకున్నారు. విత్ డ్రా చేసుకున్న నగదులో కొంత కమిషన్​ను ముగ్గురు నిందితులకు చెల్లించారు. అధిక లాభాలిస్తామంటూ మొబైల్ అప్లికేషన్ల ద్వారా ఆన్​లైన్​లో పెట్టుబడులు స్వీకరించారు. ఆ తర్వాత డబ్బులు వసూలు చేసుకొని మోసానికి పాల్పడ్డారు. ఇలా ఎంత మంది నుంచి... ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారనే కోణంలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసుతో సంబంధం ఉన్న అందరినీ అరెస్ట్ చేస్తే పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉందని సీసీఎస్ పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: friend attack on young man at birthday : పుట్టినరోజు వేడుకలో ఘర్షణ.. యువకుడిని బీరు సీసాతో కొట్టిన స్నేహితుడు

Last Updated : Dec 24, 2021, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.