పోలీసుల నుంచి తప్పించుకోడానికి నిందితులు లారీలో పారిపోతారు. వారిని వెంబడిస్తూ వస్తున్న వారికి చిక్కకుండా ఉండేందుకు మితిమీరిన వేగంతో వాహనాన్ని మెలికలు తిప్పుతూ దూసుకు పోతుంటారు. సాధారంగా ఇలాంటి సీన్లు పాత సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఘటనే వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది. కాకపోతే ఇది సినిమా షూటింగ్ కాదు... లారీని అడ్డదిడ్డండా నడిపింది నిందితులు కాదు. ఒళ్లు తెలియనంతగా మద్యం తాగి వాహనాన్ని నడిపిన డ్రైవర్.
వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై ఓ లారీ మెలికలు తిరుగుతూ వస్తోంది. ఎదురుగా వస్తున్న వాహన చోదకులు.. పక్కన వెళ్తున్నవారు ఏ క్షణాన ఎవరి ప్రాణం పోతుందోనని ఊపిరి బిగబట్టుకుని ప్రయాణించారు. స్థానికుల సమాచారంతో లారీని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అప్పుడు మొదలైంది సినిమాలోని ఛేజింగ్ సీన్. పంతిని గ్రామం వద్ద రంగంలోకి దిగిన పోలీసులు లారీని ఆపేందుకు ప్రయత్నించారు. పోలీసులకు చిక్కకుండా లారీని మితిమీరిన వేగంతో మెలికలు తిప్పుకుంటూ దూసుకుపోయాడు డ్రైవర్ (Drinking and Driving). ఎట్టకేలకు వర్ధన్నపేట సమీపంలో బారికేడ్లు అడ్డుపెట్టి వాహనాన్ని ఆపారు.
లారీ డ్రైవర్‌ను బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా.. 224 పాయింట్లు వచ్చింది. వాహనం భూపాలపల్లి నుంచి కోదాడవైపు బొగ్గులోడుతో వెళ్తుందని పోలీసులు తెలిపారు. ప్రమాదకరంగా వాహనం నడిపిన డ్రైవర్‌పైనా (Drinking and Driving), లారీ ఓనర్పైనా కేసు నమోదు చేసి లారీని సీజ్ చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: Kidnap: నా భార్యను కిడ్నాప్ చేశారు.. న్యాయం చేయండి..