Gold theft in Hyderguda: హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో జరిగిన బంగారం దొంగతనం కేసును 24 గంటల్లో నారాయణ గూడ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇంటిలో పనిచేసే పనిమనుషులే దొంగలుగా పోలీసులు తేల్చారు. మధ్యమండలం డీసీపీ సునీతారెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యేల వసతి గృహం ప్రాంతంలో ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తోన్న వరుణ్ జోషి ఇంట్లో సుమారు 81 తులాల బంగారం అపహరణకు గురైంది. బంగారాన్ని బిస్కెట్ల రూపంలో మలిచి స్టీల్ బాక్స్‌లో పెట్టిన వరుణ్ జోషి.. ఇంట్లో ఎంత వెతికిన ఆ బాక్స్ దొరకకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితులపై ఆరా తీశారు.
పని మనుషులే దొంగలుగా అవతారం: ఇంతలో ఇంటిలో పనిచేస్తున్న పనిమనుషులు రాకపోవడం గమనించారు. వారిపై నిఘా పెట్టిన పోలీసులు వారి స్వస్థలం కర్ణాటక వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. దొంగతనం తామే చేసినట్లు పోలీసులు ఎదుట ఒప్పుకున్నారు. నిందితులు గత పది సంవత్సరాలుగా తమ ఇంట్లో పనిచేస్తున్నారని వరుణ్ జోషి తెలిపారు.
నిందితులు సునీత, సురేష్, శోభ ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి సుమారు 81 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ. 36 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. ఈ ఆపరేషన్‌లో చాకచౌక్యంగా వ్యహరించిన పోలీసులను ఆమె అభినందించారు.
"నిందితులు గత పది సంవత్సరాలుగా వరుణ్ జోషి ఇంట్లో పనిచేస్తున్నారు. అందులో సునీతా అలియాస్ రాధ ఈ నెల 19వ తేదీన తన భర్త సురేష్‌తో కలిసి ఇంట్లో ఉన్న స్టీల్ బాక్స్ దొంగలించి తన భర్తకు ఇచ్చింది. దీనికి శోభ అనే మరో మహిళ సహకరించింది. వారు వెంటనే దానిని తీసుకొని కర్ణాటక వెళ్లిపోయారు. ఆ తరువాత బాధితుడు ఫిర్యాదుతో మేము వారిని పట్టుకొని మొత్తం బంగారం స్వాధీనం చేసుకున్నాం."- సునీతారెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ
ఇవీ చదవండి: