ETV Bharat / crime

మైనర్ బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు - guntur district latest news

Rape of Minor Girl in AP: ఆమె మైనర్, స్కూల్లో చదువుతున్నప్పుడు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. మెుదట స్నేహితుడిగా నటించాడు. ఆ తరువాత ఆమెను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇదే విషయమై ఆ బాలిక యువకుడిని నిలదీయగా.. బెదిరింపులకు పాల్పడ్డాడు. మోసపోయానని గ్రహించిన ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది.

Rape of Minor Girl
Rape of Minor Girl
author img

By

Published : Nov 3, 2022, 3:41 PM IST

Rape of Minor Girl in AP: బాలికపై అత్యచారం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చదువుకుంటున్న సమయంలో ఆ బాలికకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. స్నేహితుడిగా నటిస్తూ నమ్మించి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడైన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

గుంటూరు జిలాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక కొన్నేళ్ల క్రితం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. ఆ సమయంలో పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి బాలికతో యువకుడు స్నేహం చేశాడు. ఆ తరువాత ఒకరోజు బాలికను నమ్మించి పేరేచర్ల నగరవనం తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పుడు తీసుకున్న ఫొటోలను ఇటీవల ఆ యువకుడు తన సోషల్ మీడియా అకౌంట్​లో పోస్టు చేసాడు.

ఫొటోలు పోస్టు చేయడంపై బాలిక నిలదీయడంతో ఆమెను బెదిరించాడు ఆ యువకుడు. తను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.