ETV Bharat / crime

Attack: సైడ్​ ఇవ్వలేదని వీరంగం.. ఆర్టీసీ సిబ్బందిపై దాడి - కండక్టర్​పై దాడి

Attack: ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్​పై దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్​లోని ఎర్రగడ్డలో జరిగింది. కారుకు సైడ్ ఇవ్వలేదంటూ యజమాని ఆగ్రహంతో వారిపై దాడి చేశారు. ఈ దాడిలో డ్రైవర్​ అనిల్​, కండక్టర్​ పల్లె కృష్ణమూర్తికి గాయాలయ్యాయి.

Attack
దాడికి పాల్పడిన వ్యక్తి జయంత్
author img

By

Published : Apr 1, 2022, 10:26 PM IST

Attack: సైడ్ ఇవ్వలేదంటూ ఆర్టీసీ బస్సు డ్రైవర్​, కండక్టర్​పైనే దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. కారుకు సైడ్ ఇవ్వలేదని యజమాని ఆగ్రహంతో బస్సు డ్రైవర్​ను చితకబాదాడు. ఈ దాడిలో డ్రైవర్​ అనిల్​, కండక్టర్​ పల్లె కృష్ణమూర్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్​లోని ఎర్రగడ్డ వంతెనపై జరిగింది. ఈ విషయాన్ని డ్రైవర్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సనత్​నగర్ పోలీసులు కారు యజమాని నిజాంపేటకు చెందిన బుడ్డాపాటి జయంత్​గా పోలీసులు గుర్తించారు.

Attack
యజమాని కారు

సంగారెడ్డి బస్సు డిపోకు చెందిన బస్సు (ఏపీ 23 జెడ్​ 0054) బీదర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన జరిగింది. నగరంలోని ఎర్రగడ్డ బ్రిడ్జిపై వెళ్తున్న సమయంలో బస్సు డ్రైవర్ సైడ్ ఇవ్వనందుకు కారును అడ్డంగా పెట్టిన యజమాని జయంత్ డ్రైవర్​పై దాడి చేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన కండక్టర్​పై కూడా దాడికి పాల్పడ్డాడు. కారు యజమాని జయంత్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

'నేను బీదర్ నుంచి హైదరాబాద్​కు వస్తున్నాం. భరత్​నగర్ ఫ్లైఓవర్ పైకి రాగానే కారు అతను హారన్ కొడుతున్నాడు. అక్కడ సైడ్​ ఇచ్చేందుకు వీలు కాలేదు. కారు డ్రైవర్ వెంటనే లెఫ్ట్ సైడ్ నుంచి వేగంగా దూసుకొచ్చి బస్సుకు అడ్డంగా నిలిపాడు. అంతేకాకుండా నాపై దాడి చేశాడు. సైడ్ ఇవ్వలేదని దుర్భాషాలాడుతూ కొట్టాడు.' - అనిల్, ఆర్టీసీ డ్రైవర్

'మేము బీదర్ నుంచి హైదరాబాద్​కు వస్తున్నాం. భరత్​నగర్​ ఫ్లైఓవర్​ పైకి బస్సు రాగానే ఓ వ్యక్తిలో కారులో అతివేగంగా వస్తూ విపరీతంగా హారన్​ కొట్టాడు. సైడ్ ఇవ్వలేదని బస్సు ముందు కారు నిలిపి డ్రైవర్​పై దాడి చేశాడు. ఆన్​ డ్యూటీలో ఉన్నవారిని కొట్టాడు. అడ్డుకోబోయిన నన్ను కూడా ఛాతిలో తన్నాడు. ఇదంతా ప్రయాణికులంతా చూశారు. మేం వెంటనే పోలీసులకు ఫోన్ చేశాం. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నా.' - కృష్ణమూర్తి, ఆర్టీసీ కండక్టర్

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.