వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై. ఓ కారు అతి వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ మహిళ కాలుకు బలమైన గాయం కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు.
వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: మృగశిర కార్తె ప్రారంభం రోజు చేపలు ఎందుకు తింటారంటే?