వారింట్లో వారసుడు పుట్టాడనే ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఇలా జరుగుతుందని తెలిస్తే... ఆ మాయదారి విక్స్ డబ్బాను పిల్లాడికి అందుబాటులోనే పెట్టకపోదురు ఆ కుటుంబసభ్యులు. పిల్లోడు కదా బొమ్మలతో పాటు దీనితో కూడా ఆడుకుంటాడులే అనుకుని ఉంటారు. కానీ విక్స్ డబ్బా రూపంలో మృత్యువు 7 నెలల బాలుడిని వెంటాడింది.
అప్పటివరకు బొమ్మలతో ఆడుకుంటున్న బాలుడు విక్స్ డబ్బాను మింగేశాడు. దీంతో ఊపిరాడక పసికందు ఇబ్బంది పడి ఏడుస్తుంటే... ఇంట్లో వాళ్లు తనని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ దారి మధ్యలోనే బాలుడు ప్రాణాలు వదిలేశాడు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలం తొండ్లాయి గ్రామంలో చోటు చేసుకుంది.