ETV Bharat / crime

లాయర్​ మల్లారెడ్డి హత్య కేసులో ఆరుగురు అరెస్ట్​.. భూవివాదాల కారణంగానే.. - లాయర్​ మల్లారెడ్డి హత్య కేసు

Mallareddy Murder Case Updates: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లాయర్​ మల్లారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మల్లారెడ్డిని అత్యంత దారుణంగా హతమార్చిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. భూవివాదాల కారణంగానే మల్లారెడ్డిని నిందితులు హత్య చేసినట్టుగా పోలీసులు తేల్చారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 7, 2022, 8:27 PM IST

Mallareddy Murder Case Updates: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో.. పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ నెల ఒకటిన ములుగు జిల్లా పందికుంట క్రాస్​రోడ్‌ వద్ద... న్యాయవాది ములుగుండ్ల మల్లారెడ్డిని కిరాతకంగా నిందితులు హత్య చేశారు. స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించిన వివాదాల నేపథ్యంలోనే... హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. హత్య చేసేందుకు.. 18 లక్షల రూపాయల ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. గంగిరేణి గూడెం నివాసి పెరుమళ్ల రాజు.. ఈ నేరంలో ప్రధాన సూత్రదారిగా తేల్చారు.

అరెస్టయిన నిందితుల్లో... ముగ్గురు ఆంధ్రప్రదేశ్ పూర్వపు కర్నూలు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గత రెండేళ్లుగా మల్లారెడ్డిని చంపేందుకు... ప్రణాళికలు రచించినా సాధ్యం కాలేదు. ఈ నెల ఒకటిన కారులో వెళ్తున్న మల్లారెడ్డిని.. కాపు కాచి నిందితులు అతి కిరాతకంగా హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. భూమికి సంబంధించి ఏమైనా వివాదాలు ఉన్నట్లయితే కోర్టులు, రెవెన్యూ శాఖల ద్వారా పరిష్కరించుకోవాలని.. ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతిరావు పాటిల్ సూచించారు. చట్టాన్ని ఎవరూ... తమ చేతిల్లోకి తీసుకోవద్దని ఎస్పీ హెచ్చరించారు.

"ఈ నెల ఒకటో తేదీన సాయంత్రం 6:40 నిమిషాలకు పందికుంట క్రాస్​రోడ్ వద్ద న్యాయవాది మల్లారెడ్డిని హత్య చేశారు.పెరుమండ్ల రాజు, ఈడిగ జయరాం, శివ, ఈడిగ వేణు, వెంకటరమణ, పెరుమండ్ల రాకేశ్​.. కలిసి హత్యకు పాల్పడ్డారు. మల్లారెడ్డికి రాజు, జయరాం, శివకు మధ్య కొన్నేళ్లుగా భూమికి సంబంధించిన వివాదాలు ఉన్నాయి. అందులో భాగంగానే మల్లారెడ్డిని అంతమొందించేందుకు పథకం వేసి తడక రమేశ్​ సాయం తీసుకున్నారు. హత్య చేసేందుకు 18 లక్షల రూపాయలతో ఒప్పందం చేసుకున్నారు. 2020 నుంచే మల్లారెడ్డి హత్యకు కుట్ర జరుగుతోంది. అయితే ఒకటో తారీఖున.. హతమార్చేందుకు సిద్ధమయ్యారు. మల్లారెడ్డి కదలికలపై రెక్కీ నిర్వహించి పథకం వేశారు. మల్లారెడ్డి ములుగు నుంచి సాయంత్రం 6:30 గంటల సమయంలో బయలుదేరగా.. నిందితుల్లో ఇద్దరు అతని కారును వెంబడిస్తూ వచ్చారు. పందికుంట క్రాస్​రోడ్డు వద్ద మిగిలిన వాళ్లు వేచి ఉన్నారు. క్రాస్​రోడ్డు వద్ద ఉన్న స్పీడ్​ బ్రేకర్ల వద్ద కారు వేగం తగ్గించడంతో.. వెనకే వస్తున్న నిందితులు తమ కారుతో వెనుక నుంచి ఢీకొట్టారు. ఏం జరిగిందని కారు ఆపి బయటకు వచ్చిన మల్లారెడ్డిపై మిగిలిన నలుగురు నిందితులు దాడి చేశారు. పక్కనే ఉన్న చెట్లపొదల్లోకి లాక్కుపోయి కత్తితో కిరతకంగా పొడిచారు. ఆ సమయంలో మల్లారెడ్డి ప్రతిఘటించగా నిందితులకు కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయాడని నిర్ధరించుకున్న నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు." - సంగ్రామ్ సింగ్ గణపతి రావు పాటిల్, ములుగు ఎస్పీ

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.