కరీంనగర్ జిల్లా అలుగునూరు శివారులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ఫంక్షన్ హాల్ వెనుక అనుమానాస్పదంగా నిలిపి ఉన్న లారీలో సోదాలు చేపట్టగా.. గంజాయిని గుర్తించారు. టార్ఫాలిన్ కింద 15ఎరువుల సంచుల్లో దాచిపెట్టిన సుమారు 500 కిలోలు పట్టుబడింది. స్థానిక తహసీల్దార్‌కు సమాచారం అందించగా అక్కడికి చేరుకొని పంచనామా నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ జరిగింది:
'డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల లారీ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. భయపడిన డ్రైవర్ ఆ లారీని ఓ ఫంక్షన్ హాల్ వెనుక నిలిపి పరారయ్యాడు. సోమవారం రాత్రి నుంచి అనుమానాస్పదంగా నిలిపి ఉండడం వల్ల పోలీసులకు సమాచారం ఇచ్చాం' అని స్థానికులు తెలిపారు.
ఎల్ఎండీ పోలీసులు లారీలో పరిశీలించగా గంజాయి వెలుగు చూసింది. దాని విలువ సుమారు రూ.25 లక్షలుగా నిర్ధరించారు. లారీ ఓనర్, డ్రైవర్, క్లీనర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: రూ.50 లక్షల విలువైన మద్యం స్వాధీనం