ఏపీలోని కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. పుల్లంపేట మండలం బోటుమీదపల్లె వద్ద ఘటన ఎర్రచందనం తరలిస్తున్నారనే సమాచారంతో.. పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా.. 30 మంది ఎర్రచందనం కూలీలు లారీ కంటైనర్లో ఖాళీ అట్టపెట్టెల మాటున తరలిస్తున్న 129 దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు, అటవీ అధికారులను చూసి.. కూలీలు పరారైనట్లు.. డివిజినల్ ఫారెస్ట్ అధికారి ధర్మరాజు తెలిపారు. దుంగల విలువ రూ.3 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే ఫారెస్ట్ అధికారులకు తెలియజేయాలని కోరారు. పెద్ద మొత్తంలో ఎర్ర చందనాన్ని పట్టుకున్న రైల్వేకోడూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి నయీమ్ అలీ బృందాన్ని అభినందించారు.
ఇదీ చూడండి: టీ పొడి అనుకొని ఎండ్రిన్ వేసుకుని.. మహిళ మృతి