రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల శివారులోని తుర్కపల్లిలో కూలీల గుడిసెలకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. ఘటనలో సుమారు మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాదంలో షేక్ బీబీ, సయ్యద్ అంకుష్కు చెందిన రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. నగదు, బంగారం, సామగ్రి కాలిపోయాయి.
సర్పంచ్ కదిరే రజిత, వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్.. బాధితులకు తక్షణ సాయం కింద 30 కిలోల బియ్యం, రూ.1000, నిత్యావసర వస్తువులు అందించారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సహాయం చేశారు.
ఇదీ చదవండి: అతనికి తెలియదు అమ్మ లేదని.. చెల్లి రాదని...!