ETV Bharat / crime

నగరు శివారులో అగ్నిప్రమాదం... రూ.25 లక్షల టెంట్ సామాగ్రి దగ్ధం

రూ.25లక్షల టెంట్​ హౌస్​ సామాగ్రి దగ్ధమైన ఘటన శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు మంటలను గుర్తించి... అదుపు చేసేలోపు మొత్తం నష్టం జరిగిపోయింది.

FIRE ACCIDENT
అగ్నిప్రమాదం
author img

By

Published : Aug 27, 2021, 12:48 PM IST

హైదరాబాద్​ నగర శివారులో దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలో టెంట్​ హౌస్, సామాగ్రి మంటల్లో దగ్ధమయ్యాయి. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున టెంట్​హౌస్ సామాగ్రి ఉన్న గది నుంచి మంటలు ఎగిసిపడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై... మంటలార్పారు. మూడు గంటలు పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

FIRE ACCIDENT
దగ్ధమైన సామాగ్రి

తలారి బాగయ్య కుటుంబం టెంట్​ హౌస్​తోనే జీవనం సాగిస్తోంది. టెంట్​ హౌస్​ పూర్తిగా కాలిపోవడంతో బాధితులు గుండెలవిసేలా ఏడ్చారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రూ.25లక్షల టెంట్​ సామాగ్రి దగ్ధమైనట్లు గుర్తించారు. ఎవరైనా కావాలనే ఈ పని చేశారా? లేదా మరేదైనా ప్రమాదం జరిగి మంటలు అంటుకున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఎస్బీఐ బ్యాంక్​లో అగ్ని ప్రమాదం.. కంప్యూటర్లు, దస్త్రాలు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.