జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అయోధ్య శివారులో ఘోరం జరిగింది. డీ 53 కెనాల్లో 25 గేదెలు కొట్టుకుపోయి మృత్యువాత చెందాయి. మేతకు వెళ్లిన గేదెలు కాలువ దాటే సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ఆకస్మాత్తుగా నీటి ప్రవాహం వచ్చి ఆ మూగ జీవాలు కొట్టుకుపోయినట్లు పేర్కొన్నారు. గమనించిన గ్రామస్థులు కొన్నింటిని బయటకు తీశారు. సుమారు 25 గేదెలు మృతి చెందాయని.. వాటి విలువ సుమారు 25 లక్షలు ఉంటుందని స్థానికులు తెలిపారు. నష్టపోయిన బాధితులు తమని ఆదుకోవాలని ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చూడండి : విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి