ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి మండలం పూలకుంట గ్రామంలోని ఓ మహిళతో చరవాణిలో అసభ్యకరంగా మాట్లాడుతున్నారనే కారణంతో.. ఓ వర్గంపై మరో వర్గం కర్రలు, వేట కొడవళ్లతో దాడికి పాల్పడింది. ఈ నెల 3న ఘటన జరిగింది.
ఈ ఘటనలో గుత్తి పోలీసులు 21 మందిని అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా.. వారిని ఇవాళ న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారందరికి కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ.. గుత్తి సబ్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.
సంబంధిత కథనం: మహిళతో అసభ్య ప్రవర్తన.. ఇరువర్గాల ఘర్షణ
ఇదీ చూడండి : మైనర్పై అత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు