అక్రమంగా తరలిస్తోన్న 104 కిలోల గంజాయిని.. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీసులు పట్టుకున్నారు. జానారెడ్డి నగర్ వద్ద.. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ఓ బొలెరో, కారుతో పాటు 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు.. దూదిపాల వేణు, వన్నపురం రాజేందర్, దారోజు రాజేంద్ర చారి, పెదప్రోలు చంద్రయ్యలను.. పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అక్రమ రవాణా, కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్