భారీ ఆధిక్యమే లక్ష్యం
వరంగల్ పార్లమెంటు నుంచి పసునూరి దయాకర్ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నియోజవర్గ విస్తృత స్థాయి సమావేశాల్లో కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. గెలుపు ఖాయమైనప్పటికీ... భారీ ఆధిక్యమే లక్ష్యంగా గులాబీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 2న ముఖ్యమంత్రి హాజరుకానున్న ప్రచార సభకు అధిక సంఖ్యలో జనసమీకరణ చేసి సత్తా చాటాలని ఎమ్మెల్యేలు ఉవ్విళ్లూరుతున్నారు.
మంత్రి, ఎమ్మెల్యేలు, నేతలు ఏకతాటిపైకి వచ్చి పసునూరి దయాకర్‌ను మరోసారి భారీ ఆధిక్యంతో గెలిపించుకునేందుకు అలుపెరగకుండా పనిచేస్తున్నారు.
ఇవీ చూడండి:తల్లి మరణ వార్త విని గుండె ఆగింది..