TRS leader distributed LIQUOR and chicken: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలంటూ తెరాస నాయకులు మద్యం.. కోళ్లు పంపిణీ చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. వరంగల్ చౌరస్తాలో అధికార పార్టీకి చెందిన రాజనాల శ్రీహరి హమాలీ(కూలీలు)లకు మద్యం బాటిళ్లతో పాటు కోళ్లను పంపిణీ చేశారు. సుమారు 200 మంది హమాలీ కార్మికులకు పంపిణీ చేశారు. అధికార పార్టీలో ఉంటూ మద్యం పంపిణీ చేయడం అనేక విమర్శలకు దారితీస్తోంది.
దసరా కానుకగా హమాలీలకు మద్యం, కోళ్లు పంచడంపై కొంతమంది కావాలనే తప్పు పడుతున్నారని తెరాస నేత రాజనాల శ్రీహరి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకుంటారని జోస్యం చెప్పారు.
ఇవీ చదవండి: