వరంగల్ అర్బన్ జిల్లా మామునూరు పీటీసీ కళాశాలలో మహిళా సివిల్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో కమిషనర్ ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని పది పాత జిల్లాల నుంచి గతేడాది నియామకమైన 725 మంది మహిళా కానిస్టేబుళ్లు అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ పొందారని సీపీ పేర్కొన్నారు.
మామునూరు టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 292 మంది ఏఆర్ కానిస్టేబుళ్లకు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. సమాజంలో పోలీసుల పాత్ర గొప్పదని ప్రజల భాగస్వామ్యంతో నేరరహిత సామాజాన్ని నెలకొల్పేలా విధులు నిర్వర్తించాలని సీపీ సూచించారు. తొమ్మిది నెలలు కలిసి శిక్షణ తీసుకున్న మహిళా పోలీసులు.. ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు.
ఇదీ చదవండిః హైదరాబాద్‌లో మళ్లీ చెలరేగుతూ దడ పుట్టిస్తున్న గొలుసు దొంగలు