ETV Bharat / city

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​ - undefined

వరంగల్లో​ మూడో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ ప్రశాంతంగా  ముగిసింది. రెండు విడతల్లాగే ఈసారి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వైపు పోటెత్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తలేదు. 76 శాతం మేర సరాసరి పోలింగ్ శాతం నమోదైంది

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​
author img

By

Published : May 15, 2019, 5:03 AM IST

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​

స్థానిక సంస్థల ఆఖరి విడత పోలింగ్​లో ఓటరు చైతన్యం వెల్లువిరిసింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 12 గంటల దాకా ఓటర్ల సందడి కనిపించింది. ప్రధానంగా మహిళలు, వృద్ధులు, ఈసారి కూడా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. జనగామ, మహబూబాబాద్, వరంగల్ గ్రామీణ జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ జరగ్గా... ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఆఖరి విడతలో గ్రామీణ జిల్లాలో అత్యధికంగా 81.73 శాతం పోలింగ్ నమోదైంది. భూపాలపల్లిలో 70.19 శాతం మేర పోలింగ్ జరిగింది.

జిల్లాల వారిగా పోలింగ్ శాతం
వరంగల్ గ్రామీణ జిల్లాలో 81.73 శాతం, మహబూబూబాద్​లో 79.56 , జనగామలో 76.25, ములుగులో 72.31, భూపాలపల్లి 70.19 శాతం పోలింగ్​ నమోదైంది.
ఆత్మహత్య యత్నం
మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి తాను గెలువననే ఉద్దేశ్యంతో మనస్థాపానికి గురై పురుగుల మందుతోపాటు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి హుటాహుటిన తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
పరదాల మధ్య పోలింగ్​
వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో ఓ పాఠశాల వరండలానే పరదాలు కట్టి పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. భానుడి ప్రతాపానికి ఓటర్లు, పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. 2400 ఓట్లు ఉన్న చోట సరైన పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఓటర్లు అభిప్రాయపడ్డారు.
అధికారుల పరిశీలన
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, మొగుళ్లపల్లి, చిట్యాల మండలం చల్లగరిగెలలో ఎస్పీ భాస్కరన్‌ పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి పోలింగ్‌ సరళి పరిశీలించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో ఓటర్లకు పోల్ చిట్టీలు సరిగ్గా పంపిణీ చేయకపోవడంపై జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మిగతా అధికారులతో పోల్ చిట్టీలను పంపిణీ చేయించి పరిస్ధితిని చక్కదిద్దారు.

ఇవీ చూడండి: ముగిసిన తుది విడత పరిషత్​ పోలింగ్​

sample description

For All Latest Updates

TAGGED:

polling over
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.