కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ వరంగల్ గ్రామీణ జిల్లాలో విజయవంతమైంది. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం విధించుకున్నారు. జిల్లాలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పట్టణాలు, పల్లెల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
పోలీస్, వైద్య, ప్రజారోగ్య శాఖ అధికారులు విధులు నిర్వర్తించారు. బయట కనిపించిన వారికి కొవిడ్-19పై అవగాహన కల్పించి... తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జనతాకర్ఫ్యూలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సహా ప్రజలు చప్పట్లు కొట్టి విధులు నిర్వహిస్తున్న అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మామునూర్ 5వ బెటాలియన్లో శిక్షణ పొందుతున్న మహిళా కానిస్టేబుళ్లు సైతం తమ కరతాళధ్వనులతో కర్ఫ్యూకు సంఘీభావం ప్రకటించారు.
ఇవీ చూడండి: స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష: కేసీఆర్