Child swallow screws in warangal: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామోజీ కుమ్మరిగూడెం తండలో ఏడాదిన్నర బాలుడు ఆడుకుంటూ సైకిల్ ఐరన్ స్క్రూలను మింగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కుమ్మరిగూడెంకు చెందిన ఉప్పునూతుల రాంమ్మూర్తి, మాధవిల కుమారుడు అయాన్స్ ఈనెల 3న ఇంట్లో ఆడుకుంటూ సైకిల్ స్క్రూలను మింగేశాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు అతని నోట్లో నుంచి రెండు స్క్రూలను వెంటనే తీసేయగా... అనుమానంతో ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్ తీయించగా కడుపులో మరో స్క్రూ ఉందని వైద్యులు తెలిపారు. బాబు పరిస్థితి బాగానే ఉన్నా ఎప్పుడు ఏమవుతుందో అని ఆ తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే కంగారుపడొద్దని.. మోషన్ ద్వారా వస్తుందని వైద్యులు తెలిపారు. లేకుంటే ఎండోస్కోపి ద్వారా తీయాల్సి ఉంటుందని చెప్పారు.
'మా బాబు రెండు రోజుల క్రితం ఐరన్ స్క్రూలను మింగాడు. వెంటనే చూసి రెండింటిని తీశాము. ఇంకా ఏమైనా ఉన్నాయా అనే అనుమానంతో ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్ తీయిస్తే మరోకటి ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయాన్స్ ఆరోగ్యం బాగానే ఉంది. తల్లిదండ్రులు చిన్న పిల్లలు ఆడుకుంటున్నప్పుడు తగు జాగ్రత్తలు వహించి.. పిల్లలను సంరక్షించుకోవాలి.'
-రామ్మూర్తి , బాలుడి తండ్రి
ఇదీ చదవండి:Students Missing: పాఠశాలకు వెళ్లిన పదో తరగతి బాలికల అదృశ్యం