లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు, నిరుపేదలకు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తోచిన విధంగా సయమందిస్తున్నాయి. మోక్షారామం స్వచ్ఛంద సంస్థ రెండు లక్షల మాస్క్‌లను ఉచితంగా పంపిణీ చేయాలని నిశ్చయించుకుంది. అనుకున్నదే తడవుగా ఫౌండేషన్ సభ్యులతో మాస్క్‌లను తయారు చేస్తూ అందరికీ పంపిణీ చేస్తున్నారు. ఈ మంచి పనిలో మహిళలు కూడా తమ వంతు సాయం అందిస్తున్నారు.
పోలీసు, విద్యుత్ శాఖ పాటు నగరపాలక సంస్థ, ఆరోగ్యశాఖకు మాస్క్‌లను వితరణ చేస్తున్నారు. మాస్క్‌లతో పాటు పోలీస్ సిబ్బంది, వైద్యులు, వలస కూలీలు, యాచకులకు, నిరుపేదలకు భోజనాన్ని అందిస్తున్నామని మోక్షారామం వ్యవస్థాపకులు రామ శ్రీనివాస్ వివరించారు.
లాక్డౌన్ సాగినన్ని రోజులు తమ సేవలను కొనసాగిస్తామని తెలిపారు. ప్రస్తుతం నగరంలో రోజుకు 300 మంది ఆకలిని తీరుస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో రోజుకు వెయ్యి మందికి భోజనం పెట్టడమే తమ లక్ష్యమన్నారు. కరోనా వైరస్ కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
ఇవీ చూడండి: మాస్క్ మళ్లీ మళ్లీ వాడేలా.. లామినేట్ షీట్‌తో ప్రయోగం