గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2, 3వ డివిజన్ల పరిధిలోని పలు గ్రామాల్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జాన్‌పాక, మొగిలిచర్ల గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.
కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ... స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తీసివేసేందుకు సదరు యజమానులకు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్లు ప్రజలతో కలిసి బాధ్యతగా పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని కోరారు.
ఇవీ చూడండి: వైఎస్సార్ బతికుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు: అసదుద్దీన్