ETV Bharat / city

నా అభిమానులకు జరిమానా వేయండి: మంత్రి ఎర్రబెల్లి

author img

By

Published : Feb 24, 2020, 3:57 PM IST

పారిశుద్ధ్య నిర్వహణకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించబోమని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. గతంలో తన భార్యకే జరిమానా విధించినట్లు గుర్తుచేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా పలువురు అభిమానులు బాణా సంచా కాల్పడాన్ని ఎర్రబెల్లి తప్పుపట్టారు. వారికి జరిమానా విధించాలని కమిషనర్​ను ఆదేశించారు.

minister errabelli order to official to impose fines to his fans
నా అభిమానులకు జరిమానా వేయండి: మంత్రి ఎర్రబెల్లి

పట్టణాల రూపురేఖలు మార్చేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్​లోని దేశాయిపేటలో ఎమ్మెల్యే నరేందర్‌తో కలిసి మంత్రి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు కాలనీల్లో తిరుగుతూ సమస్యలపై ఆరా తీశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా పలువురు అభిమానులు బాణా సంచా కాల్పడాన్ని తప్పుపట్టారు. వారికి జరిమానా విధించాలని కమిషనర్​ను ఆదేశించారు.

పది రోజుల్లో డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వార్డుల వారీగా పారిశుద్ధ్యం, పచ్చదనం, తాగునీటి సరఫరా, మురుగు కాలువల నిర్వహణ, విద్యుత్​ లైన్ల క్రమబద్దీకరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఖాళీ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణ సరిగా లేకుంటే స్థల యాజమానికి నోటీసులు ఇవ్వాలని సూచించారు.

ఇవీచూడండి: నేటి నుంచే పట్టణ ప్రగతి... పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపే లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.