వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పురపాలికలో ఓ వ్యక్తి ఆరోవిడత హరితహారంలో భాగంగా అధికారులు జాతీయ రహదారి వెంట మొక్కలు నాటారు. స్థానికంగా ఉంటున్న స్లావత్ మంగ్యా.. తన ఇంటి ముందు నాటిన మొక్కను పీకేశాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ రవీందర్... సదరు వ్యక్తిపై స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేయడంతో పాటు రూ.20వేలు జరిమానా విధించారు.
ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ సంపదకు నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని రవీందర్ హెచ్చరించారు.
ఇదీ చూడండి: జనాల మధ్యే కాదు.. ఎవరూలేని చోటా కరోనా!