వరంగల్ అర్బన్ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల జయ జయ ధ్వానాల నడుమ స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఎడ్లబండ్లపై వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. స్వామివారి కల్యాణాన్ని తిలకించి పులకించిపోయారు.
దివ్య ముహూర్త సమయాన దేవతామూర్తుల శిరస్సుపై జీలకర్ర బెల్లం పెట్టారు. మంగళ సూత్రధారణను పండితులు రమణీయంగా నిర్వహించారు. అనంతరం తలంబ్రాల ఘట్టాన్ని నిర్వహించారు అర్చకులు.
ఇవీ చూడండి: దాహార్తికై వచ్చి.. కెమెరాకు చిక్కిన పులులు