CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉదయం రోడ్డు మార్గంలో హనుమకొండ నుంచి భద్రాచలం వెళ్తూ మధ్యలో ఆత్మకూరు మండలం కటాక్షపూర్ పెద్ద చెరువు వద్దకు రాగానే తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ‘అప్పట్లో ఈ చెరువు మీదుగా వెళ్తుంటే మత్తడి వద్ద చాలా మంది మత్స్యకారులు చేపలు పడుతూ కనిపించేవారు. వారు కూడా జై తెలంగాణ అంటూ నినదించేవారు’ అని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు వరద ఎక్కువగా వస్తే రోడ్డు మునిగిపోయి.. వాహనాలు నిలిపేయాల్సి వస్తోందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వివరించగా.. వంతెన మంజూరైందని, త్వరలోనే పూర్తవుతుందని సీఎం బదులిచ్చారు. దట్టమైన అటవీమార్గంలో నాలుగు గంటలపాటు ఆయన పయనించారు.
ఇవీ చదవండి: