ETV Bharat / city

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు.. స్తంభించిన జనజీవనం - మహబూబాబాద్​ జిల్లా అప్​డేట్​ వానలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలతో వరంగల్​ ఉమ్మడి జిల్లా తడిసిముద్దయింది. ఈదురుగాలులతో భారీ వృక్షాలు నేలకూలాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు పూర్తిగా నిండి నిండుకుండల్లా మారాయి. ఆరు జిల్లా కలెక్టర్లతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఫోన్​లో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని ఆదేశించారు.

heavy rains in joint warangal district
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు.. స్తంభించిన జనజీవనం
author img

By

Published : Oct 13, 2020, 11:52 PM IST

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్​ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. కుండపోత వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్థన్నపేట పట్టణం కేంద్రంగా ఆకేరు వాగు ఉదృతంగా ప్రవాహిస్తుండగా వర్ధన్నపేటతో పాటు రాయపర్తి, పర్వతగిరి, సంగెం మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై పత్తి, వరి పంటలు నీట మునిగాయి.

మహబూబాబాద్​ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మధ్యాహ్నం పూటే చీకటిగా మారగా వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. జిల్లాలోని శ్రీరామగిరిలో ఒకటి, మాదాపురంలో ఒకటి, మునిగలవీడులో రెండు ఇళ్లు కూలిపోయాయి.

జనగామ జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి అన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అయితే జనగామ పట్టణంలో రంగప్ప చెరువు నిండుకుని అలుగు పారుతుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

జయశంకర్​ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో విస్తారంగా పడుతున్న వానలకు సింగరేణి ఓపెన్​ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాల వల్ల కలిగే సమస్యలను తెలుసుకునేందుకు అన్ని కలెక్టర్​ కార్యాలయాల్లో హెల్ప్​లైన్​ నెంబర్లను ఏర్పాటు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అధికారులను ఆదేశించారు. శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.