ETV Bharat / city

వరంగల్​లో తగ్గని వర్షం.. రహదారులన్నీ జలమయం - జలమయమైన వరంగల్

వరంగల్​లో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం... జలమయమైంది. పలు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరి... బయటకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులపైకి భారీగా నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

heavy rain in warangal since five days wter floating on rods
వరంగల్​లో తగ్గని వర్షం.. రహదారులన్నీ జలమయం
author img

By

Published : Aug 16, 2020, 10:03 AM IST

ఎడతెరపి లేకుండా వరంగల్ నగరంలో వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. 5 రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో హన్మకొండలోని పలు కాలనీలు, ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. పలు కాలనీలో గత రెండు రోజులుగా వరద నీటిలోనే ఉండిపోయాయి. నయీమ్​నగర్​లోని... వరంగల్-కరీంనగర్ ప్రధాన రహదారిపై రెండు రోజులగా భారీగా వరద నీరు ప్రవహస్తోంది. దీంతో వరంగల్​-కరీంనగర్ మధ్య ప్రయాణించే వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

నాలాలు కుదించకపోవడం, వాటిపై అక్రమ నిర్మాణాల వల్ల వడ్డేపల్లి చెరువు నుంచి వచ్చే నీరు అంతా రోడ్డుపై ప్రవహస్తోంది. నాలాల పక్కన ఉన్న కాలనీలో ఉన్న ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల కోసం బయటకు రావాలన్నా భయపడిపోతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.