వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలోని హంటర్‌రోడ్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ క్యాంప్ ఆఫీస్‌ను మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. నాలాపై అక్రమంగా నిర్మించిన అరూరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు కూల్చివేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతలం అయింది.
ఈ క్రమంలో మున్సిపల్ శాఖ కేటీఆర్ నగరంలో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి పర్యటించారు. దీనికి కారణం నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాల వల్ల కాలనీలో వరద నీటిలో మునిగి పోయాయని అధికారులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి నాలలపై ఉన్న అక్రమ భవనాలను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. ఎంతటి వారైనా వదలి పెట్టవద్దని చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ మున్సిపాలిటీ అధికారులు రంగంలోకి దిగి అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో హంటర్ రోడ్లో నాలాపై ఉన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ క్యాంప్ ఆఫీస్‌ను కూల్చివేశారు. వరద నీరు భద్రకాళి చెరువులోకి వెళ్లకుండా నాలాపై మొరం పోసి దానిపై ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను కట్టాడు.
ఇదీ చూడండి : అతను కుంచె పడితే రక్తం ఉప్పొంగుతోంది!