ఏ నలుగురు ఒకచోట చేరినా కరోనా భయంతో దూరదూరంగా నిల్చుని మాట్లాడుకుంటున్నారు. షేక్హ్యాండ్కి బదులు.. సంస్కారంగా నమస్కారం పెట్టుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో అయితే.. ఓ పెళ్లి వేడుకలో వధువు, వరుడు, బంధువులు, అతిథులు కరోనా భయంతో మాస్కులు వేసుకొని కన్పించారు. పురోహితుడు సైతం మాస్క్ ధరించి వేదమంత్రాలు చదివాడు. పందిట్లో.. పెళ్లి సందట్లో.. పట్టు చీరలు, నగలు, ఆడంబరాలతో పాటు.. మాస్కులు కూడా సందడి చేశాయి.
ఇదీ చూడండి : పాండవుల గుట్టల్లో కలెక్టర్ రాక్ క్లైంబింగ్