చిన్న అగ్గిపెట్టె విషయంలో వచ్చిన గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వరంగల్ పట్టణం గొర్రెకుంటలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు శివనగర్‌కు చెందిన ప్రవీణ్, చార్‌బౌళికి చెందిన పవన్ కుమార్ మద్యం సేవించేందుకు వచ్చారు. అగ్గిపెట్టె విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
మాటామాట పెరగ్గా... మద్యం మత్తులో ప్రవీణ్... పవన్‌కుమార్‌పై బీరు సీసాలతో దాడి చేశారు. ఈ ఘటనలో పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: వివాహితపై గొడ్డలితో దాడి.. నిందితుడి అరెస్ట్..