ఇదీ చదవండిఃబలవంతుడిని ఢీకొంటున్న కొత్త అభ్యర్థులు
మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన
ప్రేమించి పెళ్లి చేసుకోలేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పొనుగోడులో జరిగింది.
మృతదేహంతో ధర్నా
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడుకు చెందిన నందిని.. బుధవారం పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయింది. తమ కూతురి ఆత్మహత్యకు ప్రేమికుడే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. వీరి ఆందోళనతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. పోలీసులు వచ్చి హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు.
ఇదీ చదవండిఃబలవంతుడిని ఢీకొంటున్న కొత్త అభ్యర్థులు
sample description