వైభవంగా ఉమా మహేశ్వరుల కల్యాణం వేములవాడలో కైలాసవాసుని కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరుగుతోంది. ఈనెల 22 నుంచి ప్రారంభమైన వివాహ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. అర్చకులు నిర్వహించిన బలిహరణ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. చివరి రోజు కావడం వల్ల పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఉమా మహేశ్వరుల పల్లకిసేవలో పాల్గొనేందుకు పోటీ పడ్డారు.ఇవీ చూడండి:"హస్తంను వీడి... కారెక్కుతున్న సునీతా.!"