ETV Bharat / city

ఒకేసారి 20 వేల మొక్కలు నాటి కేటీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు - manthani zp chairman wishes ktr birthday by planting trees

మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ ఏరియాలో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ మొక్కలు నాటారు. మంథని టౌన్​లో 13 మంది కౌన్సిలర్లు వారవారి వార్డుల్లో ఒకేసారి 20 వేల మొక్కలు నాటి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

20 thousand trees planted at once to wish minister ktr happy birthday at manthani
ఒకేసారి 20 వేల మొక్కలు నాటి కేటీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు
author img

By

Published : Jul 24, 2020, 12:51 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ ఏరియాలో తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ హరితహారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా మంథని టౌన్ లో మున్సిపల్ ఛైర్మన్ పుట్ట శైలజ, 13 మంది కౌన్సిలర్లు వారివారి వార్డుల్లో ఒకేసారి 20 వేల మొక్కలు నాటి కేటీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పుట్ట మధుకర్ తెలిపారు. మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు ఎంతో కాలుష్యరహిత వాతావరణాన్ని ఇవ్వొచ్చన్నారు. సీఎం కేసీఆర్ తనయుడిగా కేటీఆర్.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆయన ఆకాంక్షించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.