పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక ప్రాంతంలో నూతన సాంకేతిక పద్ధతిలో జియో పాలిమర్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. స్థానిక 37వ డివిజన్ లో నిర్మించనున్నప్రధాన రోడ్డును ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో జిహెచ్ఎంసీ, సిరిసిల్ల మినహా ఇతర ప్రాంతాల్లో జియో పాలిమర్ రోడ్డు నిర్మాణం చేపట్టడం రామగుండమే తొలి ప్రాంతమని ఆయన చెప్పారు.
సరికొత్త పద్ధతిలో నిర్మించనున్న ఈ రోడ్డు ఎక్కువ కాలం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని ఎమ్మెల్యే చందర్ అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, ఎన్టీపీసీ, సీఎస్ ఆర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.