శిరస్త్రానం ధరించి వాహనాలు నడపాలని తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏసీపీతో పాటు పోలీసులు, యువకులు బైకులకు ప్లకార్డులు ఏర్పాటు చేసుకుని గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు.
ర్యాలీ చేస్తున్న సమయంలో వివిధ ప్రాంతాల్లో వాహనదారులకు శిరస్త్రానం అవసరంపై అవగాహన కల్పించారు. ద్విచక్రవాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఏసీపీ ఉమేందర్ సూచించారు. శిరస్త్రానం ధరించడం వల్ల వాహనదారులతో పాటు మిగతావారి ప్రాణాలనూ కాపాడిన వారవుతారని ఉమేందర్ అన్నారు.
ఇదీ చదవండిః హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు