నిజామాబాద్ పార్లమెంట్‌లో మళ్లీ కవితను ఎంపీగా అత్యధిక మెజార్జీతో గెలిపించేలా సమష్టిగా కృషి చేస్తామని నాయకులు చెబుతున్నారు.
తెరాస ప్రచారం షురూ - TRS
లోక్సభ ఎన్నికల షెడ్యూలు విడుదల కాగానే.. తెరాస ప్రచారానికి శ్రీకారం చుట్టింది. నిజామాబాద్ ఎంపీ కవితను గెలిపించాలని కోరుతూ.. వినూత్న రీతిలో గులాబీ నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు.
తెరాస ప్రచారం షురూ
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి డివిజన్‌లో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను మళ్లీ గెలిపించేందుకు ఇప్పటి నుంచే గ్రామగ్రామాన ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే తెరాస నాయకులు మెట్‌పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని గోడలపై రంగురంగుల రాతలు రాశారు. ప్రజల దృష్టి తెరాస వైపు పడేలా చేస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వ పథకాలను విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం సాగిస్తున్నారు.
నిజామాబాద్ పార్లమెంట్‌లో మళ్లీ కవితను ఎంపీగా అత్యధిక మెజార్జీతో గెలిపించేలా సమష్టిగా కృషి చేస్తామని నాయకులు చెబుతున్నారు.
sample description