పేదల సొంతింటి కలను సాకారం చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో రూ.3.15 కోట్లతో నూతనంగా నిర్మించిన 50 డబుల్ బెడ్రూం ఇళ్లను పోచారం ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇంటి పత్రాలను అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేత, డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, ఆర్డీఓ రాజ గౌడ్, సర్పంచ్ నారాయణ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఫిబ్రవరి నుంచి భారత్ బయోటెక్ నాజల్ డ్రాప్ టీకా తొలిదశ ట్రయల్స్