ETV Bharat / city

'మా బిడ్డను మాకు అప్పగించండి' - నిజామాబాద్​ తాజా వార్తలు

"ఐదు సంవత్సరాల నుంచి కూతురు కోసం తిరుగుతున్నాం. వచ్చిన ప్రతి సారి కిటికీలో నుంచి చూసి వెళ్లిపోవడమే. పీహెచ్​డీ చేసిన అమ్మాయి... తమకు దూరంగా ఆశ్రమంలో ఉండటంపై మాకు అనుమానాలున్నాయి". ఇది ఆ తల్లిదండ్రుల ఆవేదన. మా బిడ్డను మాకు అప్పగించండి అంటూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు నిజామాబాద్​కు చెందిన రాంరెడ్డి దంపతులు.

parents fight for her daughter
మా బిడ్డను మాకు అప్పగించండి
author img

By

Published : Feb 29, 2020, 10:55 PM IST

తమ కూతురిని ఆధ్యాత్మిక ముసుగులో బంధించారని నిజామాబాద్ జిల్లాకు చెందిన దంపతులు దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అమెరికాలో పీహెచ్​డీ చేస్తున్న తమ కూతురిని ఆధ్యాత్మికత పేరుతో దిల్లీ ఆశ్రమానికి తీసుకొచ్చారని.. తనను ఉంచిన ఆశ్రమాన్ని చూస్తే తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని రాంరెడ్డి దంపతులు పిటిషన్​లో పేర్కొన్నారు. ఇప్పటికే ఆశ్రమ నిర్వాహకుడిపై కేసులు ఉన్నాయని తెలిపారు. తమ కూతురిని మనస్ఫూర్తిగా కలిసే అవకాశం కూడా ఇవ్వట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

విచారణ ఏప్రిల్ 13కి వాయిదా..

పిటిషన్​ను విచారణకు స్వీకరించిన దిల్లీ హైకోర్టు... కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 13కి వాయిదా వేసింది. ఆశ్రమంలో తమ కూతురికి వైద్యపరీక్షలు చేయించాలని.. డ్రగ్స్ వంటి పదార్థాలు ఎక్కించారేమో తెలుసుకునే ప్రయత్నం చేయాలని తల్లిదండ్రులు కోర్టును కోరారు.

నిర్వాహకుడిపై కేసులు..

గతంలో పలు ఆరోపణలతో ఆశ్రమ నిర్వాహకుడిపై కేసులు నమోదుగా కాగా విచారణ జరుగుతుందని.. అతను పరారీ ఉన్నట్లు వారు చెబుతున్నారు. ఆశ్రమంలోని పలువురు అమ్మాయిలు మాత్రమే అక్కడ ఉంటున్నారని చెప్పారు.

'మా బిడ్డను మాకు అప్పగించండి'

ఇవీ చూడండి: హైదరాబాద్ శివారులో దారుణం.. కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.