నిజామాబాద్ నగర కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ నీతూ కిరణ్ అధ్యక్షతన మెడికల్ వేస్టేజ్ (జీవ వైద్య వ్యర్ధాల) నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని మెడికల్ వేస్టేజ్‌ను ఉత్పతి చేసే ఆసుపత్రులు, లాబ్స్, నర్సింగ్ హోమ్స్, బ్లడ్ బ్యాంక్స్ వ్యర్ధాలను మెడికేర్ సర్వీసెస్ వారితో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. నగర మున్సిపల్ కమీషనర్ జితేష్. వి. పాటిల్, డీఎంహెచ్‌వో సుదర్శనం, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ భిక్షపతి, ఐఎంఏ అధ్యక్షుడు జీవన్ రావ్, కార్యదర్శి విశాల్, వైద్యులు, ఆర్ఎంపీ, పీఎంపీలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆరో విడత హరితహారం.. సీఎం పర్యటనకు సర్వం సిద్ధం