ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్జేసీ, ఆర్డీసీ సెట్ 2019, మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల ఇంటర్మీడియట్, డిగ్రీ మొదటి సంవత్సర ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా... డిగ్రీ ప్రవేశాలకు 619, ఇంటర్‌కు 2,981 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగింది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండిః పరీక్షలు మళ్లీ వస్తాయి... ప్రాణాలు రావు: హరీశ్ రావు